ఆధ్యాత్మికమార్గము
ఆధ్యాత్మిక మార్గము' అనే ఈ పుస్తకము 'ది పాథ్ ఆఫ్ ది మాస్టర్స్' అనే ఆంగ్లపుస్తకానికి అనువాదం. ఈ పుస్తకంలో రచయిత సంతుమార్గంగురించి వివరంగా చర్చించారు. డా. జూలియన్ జాన్సన్ 1930 వ దశాబ్దంలో తన సద్గురువు మహారాజ్ సావన్ సింగ్ గారి సాంగత్యంలో 7 సంవత్సరాలు గడపిన పిదప సురత్-శబ్దయోగం రూపురేఖలను మనముందు ఉంచారు. ఈ యోగం ఒక శాస్త్రీయపద్ధతి. దీనిని ఆచరించి సంతులు ఆధ్యాత్మిక అభివృద్ధిలో అత్యున్నత స్థితిని పొందుతారు. ఈ పుస్తకం ఇరవైయవ శతాబ్దపు ఆధ్యాత్త్మిక సాహిత్యంలో అత్యుత్తమ రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిలో ఆధ్యాత్మిక మార్గంలోని అనేక ప్రాథమికసూత్రాలనుగురించి వివరించబడింది. మానవజన్మయొక్క ప్రయోజనం, సంతుసద్గురువులు, వారి కార్యక్రమాలు, శబ్దధ్వని, బాహ్య మరియు ఆంతరిక విశ్వములు, కర్మ మరియు పునర్జన్మ, మరణం మరియు ఆత్మను తిరిగి పరమాత్మవద్దకు తీసుకుపోయే ఆంతరిక ప్రయాణం మొదలైన విషయాలు ఉన్నాయి. రచయిత మనసుయొక్క కార్యకలాపాలను విశ్లేషించారు మరియు ప్రపంచంలోని మతాలనుగురించి చర్చించారు. ఈ దేహంలో ఉంటూనే శాస్త్రీయపద్ధతిలో మనలోపల పరమాత్మతో కలయికను సాధించడము ఈ పుస్తకంలోని ప్రధానాంశము. This book presents a comprehensive discussion of Sant Mat, also known as the path of the Masters. After living in India for nearly seven years in the 1930s at the home of his Master in India, the author gives an outline of Surat Shabd Yoga, the yoga of the sound current, which is the scientific system through which the Masters attain the highest degree of spiritual development. Considered a classic of twentieth-century spiritual literature, the book covers many fundamentals of the spiritual path, including: the purpose of human life, the Masters and their duties, the audible life stream, the outer and inner universes, karma and reincarnation, death, and the inner journey back to God. The author also gives a thorough analysis of the workings of the mind, and a review of world religions. He explains that at the heart of the book is "a scientific method of entering and realizing the kingdom of heaven while still living in the human body."
English: Path of the Masters, The Author: Dr. Julian P. Johnson
Category: RSSB Tradition: Other Authors
Format: Hardcover, 520 Pages
Edition: 1st, 2021
ISBN: 978-93-93426-05-5
RSSB: TG-064-0
Price: USD 13.00 including shipping.
Estimated price: EUR 12.30, GBP 10.68
|